What's New

Gallery

More >>

Movie Reviews

Upcoming Movies

Wednesday 20 May 2015

Rajamoli Satires on top Heroine Daughter


తన పని తాను చక్కగా చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళి ఒక టాప్ హీరోయిన్ కుమార్తె పై వేసిన సెటైర్లు ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారడమే కాకుండా రాజమౌళిలోని హాస్య చతురతను అందరికీ తెలిసేలా చేసింది. ఇక వివరాలలోకి వెళితే రెండు రోజుల క్రితం రాజమౌళి తన ‘బాహుబలి’ సినిమాలోని తమన్నా అవంతిక లుక్ ను బయట పెట్టాడు.

ఈ లుక్ ను చూసిన ఒకనాటి టాప్ హీరోయిన్ నేటి రాజకీయ వేత్త ఖుష్బూ రాజమౌళి ‘బాహుబలి’ లోని అవంతిక లుక్ చాల బాగుంది అని ట్విట్ చేయడమే కాకుండా తన కుమార్తె పేరు కూడ అవంతిక అంటూ ఆ ట్విట్ లో ఖుష్బూ తెలియచేసింది.ఈ ట్విట్ చూసిన వెంటనే రాజమౌళి వెరైటీగా స్పందిస్తూ ‘ఆమె కూడా ఒక దేవకన్య కాదంటారా’ అంటూ సరదాగా ఖుష్బూ కు రిప్లై ఇచ్చాడు రాజమౌళి.

జక్కన్న హాస్య చతురతకు నిదర్శనంగా నిలిచిన ఈ ట్విట్ ను చాలామంది ఆశక్తిగా చూసారు.  ఇక ‘బాహుబలి’ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నిడివి  రెండు భాగాలు కలిపి 290 నిముషాలు రావడంతో ఈ సినిమాను ఒకొక్క పార్ట్ కు రెండు గంటల చొప్పున కుదించినప్పుడు మాత్రమే అంతర్జాతీయంగా ఈ సినిమాకు ప్రపంచoలోని అన్ని భాషల నుండి డిమాండ్ ఏర్పడుతుందని కేన్స్ అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో పాల్గొంటున్న చాల దేశాలకు చెందిన సినిమా ప్రముఖులు ఈ సినిమా నిర్మాత శోభు యార్ల గడ్డకు సూచించారని టాక్.

రాబోయే జూలై 10న విడుదల కాబోతున్న ఈ సినిమాను తెలుగు తమిళ హిందీ భాషలలో 3500 ధియేటర్లలో విడుదల చేస్తూ అత్యంత భారీ ఓపెనింగ్స్ పై కన్నేశాడు రాజమౌళి. ఈ సినిమా ఆడియో ఈనెల 31న విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా ఆడియో విజయం బట్టి ‘బాహుబలి’ ఏ స్థాయిలో విజయవంతం అవుతుంది అనే అంచనాలకు రావచ్చని విశ్లేషకుల భావన.


Post a Comment

Thank You For Your valuable feedback

-Mana Telangana

 
Copyright © 2013 Mana Telangana Telugu Movies | Film News, Short Films
Share on kattewar.com. Powered byMana Telangana