What's New

Gallery

More >>

Movie Reviews

Upcoming Movies

Wednesday, 20 May 2015

Mohan Babu Angry on Prabhas in Manoj Wedding


ఈరోజు ఉదయం మంచు మనోజ్ పెళ్ళి సందడి అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ సెలెబ్రెటీల దగ్గర నుంచి రాజకీయ వేత్తల వరకు వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు మంచు వారి పెళ్ళి పిలుపుకు స్పందించి మనోజ్ ప్రణతి లను ఆశీర్వదించారు. అయితే అందర్నీ ఆప్యాయంగా పలకరించిన మోహన్ బాబుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై మాత్రం కోపం వచ్చి అలిగినట్లు టాక్.

దీనికి కారణం ప్రభాస్ ఈ పెళ్ళికి చాల ఆలస్యంగా రావడమే అని అంటున్నారు. పెళ్లికి ఆలస్యంగా రావటంతో పాటు కుటుంబ సభ్యులను తీసుకు రాలేదని మోహన్ బాబు కొద్ది సేపు ప్రభాస్ పై అలక వహించినట్లు తెలుస్తోంది. దానితో బెదిరి పోయిన ప్రభాస్ మోహన్ బాబును గట్టిగా హత్తుకుని గెడ్డం పట్టుకుని బతిమాలి అలాగే నడుస్తూ  నూతన వధూవరుల దగ్గరకు వెళ్ళాడు.

ఆ తరువాత పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని అక్షింతలు వేసి ఆశీర్వదించాలని మోహన్ బాబు కోరగా వద్దులే ఎందుకు కలిసి ఫొటోలు దిగుదామంటూ  ఫొటోలు తీయించుకున్నాడు ప్రభాస్. అయితే అక్కడితో ఆగకుండా మోహన్ బాబు కొత్త దంపతులతో ప్రభాస్ కాళ్లకు దండం పెట్టించి, అక్షింతలు వేయించాడట.

ఆ తరువాత ప్రభాస్ లక్ష్మీ ప్రసన్న కూతురుతో ప్రభాస్ ముచ్చట్లు ఆడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు జరిగిన మంచు మనోజ్ పెళ్ళి ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో జరిగిన అత్యంత ఘనమైన పెళ్ళిగా రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా ఇరు రాష్ట్రాలలోని తెలుగు వారిని మంచు వారి పెళ్ళి సందడి అందర్నీ ఆకర్షించింది..

Post a Comment

Thank You For Your valuable feedback

-Mana Telangana

 
Copyright © 2013 Mana Telangana Telugu Movies | Film News, Short Films
Share on kattewar.com. Powered byMana Telangana